telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

డీఎస్పీలే ఏకగ్రీవం చేస్తున్నారు…

ap cpi leader ramakrishna on jagan as cm

ఏపీలో ప్రస్తుతం హల చల్ చేస్తున్న విషయం విషయం విశాఖ ఉక్కు పరిశ్రమ. అయితే తాజాగా ఈ విషయం ఫై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్‌ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఆత్మబలిదానాలు జరిగాయని.. ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.  బిజిపి నేతలు ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రి అపోయింట్మెంట్ కూడా ఇవ్వలేదని..కేంద్ర మంత్రులు రాష్ట్ర బీజేపీ నేతలకు క్లాస్ పీకారని చురకలు అంటించారు.  లక్షల భూమిని కారుచౌకగా  ప్రైవేటు వ్యక్తులకు నరేంద్రమోదీ  కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని.. ఈ నెల 5న జరిగే బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. పోలీసులు, వాలంటీర్లు,  డబ్బులతో ఎన్నికల్లో వైసీపీ గెలుపొందుతుందన్నారు.  ఎవరు నామినేషన్ వేయాలి.. ఎవరు విత్ డ్రా చేయాలో పోలీసులే అదేశిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఏకగ్రీవం కావాలంటే డీఎస్పీలే చేస్తున్నారని.. మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో అదే చేస్తున్నారని మండిపడ్డారు. ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు పోతాయని వాలంటీర్లు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై ప్రత్యర్ధులు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts