telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో నియంతృత్వ పోకడలు: కోదండరామ్

kodandaram protest on inter students suicide

తెలంగాణలో ప్రస్తుతం నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు తప్ప మరే విభాగం క్రియాశీలకంగా లేదని వ్యంగాస్త్రాలు సంధించారు. కేవలం పోలీసులు మాత్రమే యాక్టివ్ గా పనిచేస్తున్నారని అన్నారు.

సమస్యల పరిష్కారం కోరుతూ 45 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సింది పోయి కార్మికులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి పోకడలు ఏ ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు.

Related posts