ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. అయితే తాజాగా చెన్నై ఆటగాడు మొయిన్ అలీ మాట్లాడుతూ… ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆడిన కొంతమంది క్రికెటర్లతో నేను మాట్లాడాను. తమ ఆటతీరును మహీ ఎలా మెరుగుపరిచాడో వారు నాకు వివరించారు. కేవలం గొప్ప నాయకులే అలా చేస్తారని నా నమ్మకం. ధోనీ నేతృత్వంలో ఆడాలని ప్రతి ఆటగాడి కోరికల జాబితాలో ఉంటుంది. ఎందుకంటే అతడు అలాంటి ఆత్మవిశ్వాసం, స్పష్టతను ఇస్తాడని అనుకుంటున్నా. అందుకే అతడి వద్ద ఆడేందుకు నేనెంతో ఆత్రుతగా ఉన్నా’ అని అన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో సీఎస్‌కే రూ. 17.35 కోట్లు ఖర్చు చేసింది. సీఎస్‌కే కోనుగోలు చేసిన వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీతో పాటు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కూడా ఉన్నాడు. సీఝుడాలి మరి వీరు ఎలా రాణిస్తారు అనేది.
previous post
next post
కేసుల మాఫీ కోసం గంటా వైసీపీ వైపు మొగ్గు: మంత్రి అవంతి