అబ్ధిమేఖలపై
అపురూప సంపద
అనంతజీవులు
వెతుకుతున్నాను
ఎంతవెతికినా
నాక్కా వలసిన
‘మనిషి’ లేడు!
కీర్తికాముకులు
సంపాదనా పరులు
కవులు కళాకారులు
ఆటగాళ్ళు పాటగాళ్ళు
ఉద్యోగులు వ్యాపారులు
నాయకులు మంత్రులు
వెలిగి పోతున్నారు!
పోలీసులు దొంగలు
టివిలు పత్రికలు
మంచోళ్ళు చెడ్డోళ్ళు
నవ్వులు ఏడ్పులు
అబద్ధాలు నిజాలు
బహుముఖవేషాలు
మనిషి మాత్రం లేడు!
భక్తులు విరక్తులు
దాతలుముష్టోళ్ళు
పెదవులపై హాసం
మదిలో దోషం
దురాశాపరులు
వ్యవస్థాగత మై
మనిషి మాయమై!
వెతుకుతున్నాను
ఏమైపోయాడో!
కాకాలు బాకాలు
లంచాలుదందాలు
లాభాలు నష్టాలు
కొత్తవ్యాపారాలు
కొత్త రోగాలు!
మనిషి లేడు
మానవత్వం లేదు
మమతలు ప్రేమలు
మృగ్యమైపోయాయి
ముద్దుముచ్చట్లు
ఆప్యాయతలు
ఆవిరై పోయాయి!
పోరాడుతూ
ఉద్యమిస్తూ
సమ్మెలుచేస్తూ
అన్యాయానికి
దుష్టచట్టాలకు
నలిగిపోతూ
మలిగిపోతూ!
కష్టపడే వాళ్ళు
అన్నం పెట్టేవాళ్ళు
ఆదర్శజీవులు
సత్యవ్రతులు
నిత్యసంతోషులు
దుఃఖ భాజనులై
అఘోరిస్తున్నారు!
‘మనిషి’కావాలి
ఎక్కడున్నాడు?
ఏ’ముసుగు’లేని
ప్రేమైకమూర్తి
సహకారవర్తి
మనిషి కావాలి
మనిషే కావాలి!
రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారు: శివసేన