telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

జీహెచ్‌ఎంసీలో కరోనా కలకలం.. సెలవు ప్రకటించిన బల్దియా

తెలంగాణలో కరోనా విలయం సృష్టిస్తోంది.  రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..  గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 431 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇద్దరు కరోనాతో మృతిచెందారు..దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,298 కు చేరగా.. రికవరీ కేసులు 2,99,270 కు పెరిగాయి. మరోవైపు ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,676 మంది మృతి చెందారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. 5 వ అంతస్థులోని చీఫ్ ఇంజనీర్ (మేయింటనెన్స్) విభాగంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. 5 వ అంతస్తును సిబ్భందితో శానిటైజ్ చేయించారు. అంతేకాదు… ఇవాళ 5 వ అంతస్థు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది బల్దియా. అటు మిగతా ఉద్యోగుల్లోనూ కరోనా కలవరపెడుతోంది. తమకు కూడా కరోనా సోకుతుందనే భయంలో ఉద్యోగులు ఉన్నారు. తొందరగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కూడా ఉద్యోగుల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. 

 

Related posts