telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో వేతనాల కోత.. జీవో జారీచేసిన ప్రభుత్వం!

Hyderabad Police Seize Three Crores

లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయం భారీగా తగ్గింది. దీంతో ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థల, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల మార్చి నెల వేతనాల్లో కొంత మొత్తంపై కోత విధించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఇలా కోత విధించిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక వారికి తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాల సమాచారం.

ఈ జీవో ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గ్రాస్ స్యాలరీలో 75 శాతం కోత విధించనున్నారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాల్లో 60 శాతం, మిగతా అన్ని క్యాటగిరీ ఉద్యోగుల వేతనాల్లో50 శాతం విధించనున్నారు. అధేవిధంగా అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం, నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో10 శాతం, నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత విధిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related posts