telugu navyamedia
సినిమా వార్తలు

లయన్ లా ఉన్నావ్ నాన్న..

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ‌రాయ్‌’. కోల్ క‌త్తా బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ సినిమా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న విడుల‌కు స‌న్న‌ద్ధ‌మవుతుంది. దేవ దాసీ వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేసే శ్యామ్ సింగ‌రాయ్‌గా నాని క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ , సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి.

Teaser of Nani's highly anticipated 'Shyam Singha Roy' unveiled - DTNext.in

ఈ మూవీలో డబుల్‌ రోల్‌లో పోషిస్తున్న నాని ఓ పాత్రలో శ్యామ్‌ సింగరాయ్‌గా పెద్ద మీసంతో సరికొత్తగా అలరించబోతున్నాడు. ఈ మూవీ నానికి జోడిగా సాయి పల్లవి, కృతిశెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Happy Birthday Nani: Here are his best pictures, video with wife, son -  Hindustan Times

తాజాగా తనయుడు జున్నుతో నాని ఆడుకుంటున్న క్యూట్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. నాని బెడ్‌పై పడుకుని ఉండగా.. జున్ను తండ్రి  గుండెపై కుర్చుని మీసంతో ఆడుకుంటున్నాడు. నాన్న మీసాలు మెలేస్తూ  ఉంటే  ‘నాపేరు ఎంటో తెలుసా?’ అని జున్నుని అడుగుతాడు. దానికి శ్యామ్ సింగ‌రాయ్ అని స‌మాధానం ఇచ్చాడు జ‌న్ను. ఆ తర్వాత లయన్‌ లాగా ఉన్నావు నాన్న అంటాడు. దానికి నాని అవునా అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్యూట్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Related posts