telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

బత్తాయితో అద్భుత లాభాలు..

మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు తీసుకుంటాం. అలాంటి ఆహారం తీసుకుంటేనే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ఎలాంటి వారైనా మంచి ఆహారం తీసుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. అందరికీ అందుబాటులో ఉంటూ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది బత్తాయి. ఈ బత్తాయి వల్ల అనేక లాభాలున్నాయి.
లాభాలు :
1. ముఖ్యంగా బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపేందుకు దోహదపడతాయి. ఇది జీర్ణసమస్యలను నివారిస్తుంది.

2. మలబద్దకంతో బాధపడేవాళ్లకి బత్తాయి రసంలో చిటికెడు ఉప్పువేసి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇందులోని పొటాషియం మూత్రపిండాలు, మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది.

3. డయేరియా వల్ల కలిగే అలసటకీ, నీరసానికి బత్తాయిరసం అద్బుతమైన మందు.

4. బత్తాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, స్కర్వీ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. చిగుళ్లు నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్టు కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది.

5. ప్లూ, వైరస్‌లతో బాధపడే వాళ్లకి ఈ రసం బాగా పనిచేస్తుంది. వీటిలో సమృద్దిగా ఉండే ప్లేవనాయిడ్లు అల్సర్‌ను తగ్గిస్తాయి.

6. గర్భిణీల్లో శిశువు పెరుగుదలకు బత్తాయి రసంలో పోషకాలు అన్నీ దోహదపడతాయి. ఇది రక్తవృద్దికి, వీర్యవృద్దికీ కూడా తోడ్పడుతుంది. నరాల మీద ఒత్తిడినీ తగ్గిస్తుంది.

7. బత్తాయిరసంలో జీలకర్ర, అల్లంపొడి వేసుకొని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవాళ్లకి ఉపశమనంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి దోహదపడతాయి.

Related posts