telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మైనర్ అమ్మాయితో ప్రేమ కోసం స్వీడన్ టు అమెరికా… చివరకు జైలుకు

Arrest

స్వీడన్‌కు చెందిన జోకిన్ రస్తాన్ నబీ ఆల్సన్ అనే 44 ఏళ్ళ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకుని తన కోరిక తీర్చుకోడానికి ఏకంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఓ మైనర్. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న ఓ మైనర్ అమ్మాయి సోషల్ మీడియా ద్వారా జోకిన్‌తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక ఇదే మంచి అవకాశమనుకున్న జోకిన్ తన కోరిక తీర్చుకోడానికి స్వీడన్ నుంచి అమెరికాకు పయనమయ్యాడు. అయితే అమ్మాయి మరీ చిన్న వయసు కలిగి ఉండటంతో ఆమెతో కేవలం షాపింగ్‌లకు, సినిమాలకు వెళ్లి స్వీడన్‌ తిరిగి వచ్చేశాడు. మళ్లీ రెండు నెలల తరువాత ఫ్లోరిడాకు వెళ్లిన జోకిన్ యువతిని ఓ మోటెల్‌కు తీసుకెళ్లి తన శృంగార కోరికను తీర్చుకున్నాడు. అయితే వీరిద్దరిని చూసిన మోటెల్ సిబ్బందికి అనుమానం కలగడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని జోకిన్‌ను అరెస్ట్ చేశారు. గదిని సోదా చేయగా.. చెత్త బుట్టలో వాడి పడేసిన కండోమ్‌లు దొరికాయి. ప్రేమ అంటే ఏంటో తెలియని వయసున్న అమ్మాయిని మోసం చేసినందుకు జోకిన్‌పై కేసు నమోదు చేశారు. కాగా, తనపై జోకిన్ ఎటువంటి అత్యాచారానికి పాల్పడలేదని, తన ఇష్టంతోనే అంతా జరిగిందని మైనర్ యువతి పోలీసులకు తెలిపింది. ఆమెకు తల్లిదండ్రులు లేరని, ఓ బంధువు ఇంట్లో ఉంటున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.

Related posts