telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జున కోసం వంట చేసిన మెగాస్టార్‌

తెలుగు పరిశ్రమలో మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జునకు ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి హీరోల సినిమాలంటే జనాలు పడిచస్తారు. ఈ ఇద్దరు హీరోలతో ఎంతో మంది స్టార్‌ హీరోలు తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. అంతేకాదు ఈ చిరు, నాగ్‌ కుటుంబాలలో జరిగే వేడుకలల్లో కూడా వీరిద్దరూ పాల్లొంటారు. అయితే.. ప్రస్తుతం ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే.. విషయం ఏమిటంటే.. నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్‌ డాగ్‌. ఈ సినిమా ఇవాళ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రచారం కార్యక్రమాలతో రెస్ట్‌ లేకుండా గడిపిన నాగ్‌.. తాజాగా చిరు ఇంటికి గెస్ట్‌గా వెళ్లారు. దీంతో చిరంజీవి.. నాగ్‌ కోసం ఓ కమ్మని వంటకం చేసాడు. దీనికి సంబంధించిన నాగ్‌ ట్విట్టర్‌లో చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. వైల్డ్‌డాగ్‌ రిలీజ్‌ నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు చిరు స్వయంగా వంటచేశాడు. నాకోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది అంటూ నాగ్‌ ట్వీట్‌ చేశారు. ఆ ఫొటో కాస్త వైరల్‌ అయింది. అంతేకాదు ఆ ఫొటో చూసి ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి “ఆచార్య” మూవీలో బిజీగా ఉన్నారు.

Related posts