telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు : బాలకృష్ణ

Balakrishna

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి య‌న్‌.టి.రామారావు జీవితాన్ని భ‌విష్య‌త్తు త‌రాల‌కు తెలిసేలా ప‌ద‌వ త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కాల్లో ప్ర‌చురించ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు నందమూరి బాల‌కృష్ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఫేస్ బుక్ ద్వారా బాల‌కృష్ణ స్పందించారు. “క‌ళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అంతేకాదు పుస్త‌కంలోని పాఠ్యాంశాల‌కు సంబంధించిన పేజీల ఫొటోల‌ను కూడా బాలకృష్ణ షేర్ చేశారు.

కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు,…

Posted by Nandamuri Balakrishna on Friday, 4 September 2020

Related posts