నేడు ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తదితర ప్రత్యేక దళాలను మోహరించారు. నగరంలోని రైల్వే మైదానంలో నేటి సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. కేంద్రం రెండు రోజల క్రితం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ అసమగ్రంగా, అన్యాయంగా ఉందంటూ నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్టు ఏర్పాటు చేశారు.
సాయంత్ర 6:20 గంటలకు ప్రత్యేక విమానంలో మోదీ నగరంలోని నౌకాదళ వాయుస్థావరమైన ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి 6:45 గంటలకు రైల్వే మైదానానికి చేరుకుని 6:55 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. 7:40 గంటలకు ప్రసంగాన్ని ముగించనున్న మోదీ 7:55 గంటలకు తిరిగి బయలుదేరుతారు.
సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. మాధవీలత షాకింగ్ పోస్ట్