telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ సంయుక్త హెగ్డేపై దాడి

Samyuktha

ప్రముఖ హీరోయిన్ సంయుక్త హెగ్డేకి ఊహించని షాక్ త‌గిలింది. తాజాగా ఆమె స్పోర్ట్స్ బ్రా వేసుకుని డాన్స్‌, వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి కొంత మంది స్నేహితులతో కలిసి బెంగ‌ళూరులోని ఓ పార్కుకు వెళ్లారు. ఆ స‌మయంలో అక్క‌డున్న‌ క‌వితా రెడ్డి అనే మ‌హిళ సంయుక్త‌పై దాడి చేసింది. ప‌బ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డంతో పాటు మీ ఆర్టిస్టులంద‌రూ డ్ర‌గ్స్ వాడుతారంటూ సంయుక్త హెగ్డేపై దాడి జరిగింది. దాడి చేసిన స‌దరు మ‌హిళకు అక్క‌డే ఉన్న కొంత మంది ప‌బ్లిక్ కూడా సపోర్ట్ చేయడం గమనార్హం. ఈ అనుకోని పరిణామానికి నిర్ఘాంతపోయిన సంయుక్త ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జ‌రిగిన విష‌యాన్ని తెలియ‌జేశారు. అంతే కాకుండా త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన ఆధారం ఉందంటూ సంయుక్త పేర్కొన్నారు. తెలుగులో నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2, నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది సంయుక్త హెగ్డే.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on

Related posts