telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో ఇవాళ, రేపు సెలవులు

heavy rains in telangana for 2days

తెలంగాణను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తూర్పు, మ‌ధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్‌, ఉత్త‌ర‌, ప‌శ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు జిల్లాల్లోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అప్ర‌మ‌త్తం చేశారు. ఇప్ప‌టికే కురుస్తున్న కుండ‌పోత వాన‌ల‌కు రాష్ర్టంలోని ప్రాజెక్టుల‌కు, చెరువుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. స్కూళ్ళు, కాలేజీల ఆన్లైన్ క్లాసులు కూడా రద్దు చేసింది.

Related posts