‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే.. తాజాగా 74వ చిత్రం ‘నారప్ప’ చేస్తున్నాడు. ఈ సినిమా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. వెంకీ 75వ సినిమాను అనీల్ రావిపూడితో ఎఫ్3 చేయనున్నాడు. ఇటు వరుణ్ తేజ్ కూడా ఎఫ్3 సినిమాలో చేయబోతున్నాడు. అయితే… ఎఫ్2 భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమాపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. హిట్ మూవీ ఎఫ్2 కు సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 కి హీరోలు అయిన వెంకటేష్, వరుణ్ తేజ నిర్మాత దిల్ రాజ్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారట. ఈ సినిమాకు ఆ ఇద్దరు హీరోలు తమ రెమ్మూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం వరణ్ రూ. 12 కోట్లు, వెంకీ రూ. 13 కోట్లను డిమాండ్ చేశారట. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి సైతం తన రెమ్మూనరేషన్ పెంచేసినట్లు టాలీవుడ్ టాక్. దీంతో చేసేదేమీ లేక వారి డిమాండ్లకు నిర్మాత దిల్ రాజ్ కూడా అంగీకరించాడని సమాచారం.
previous post
next post
పెళ్ళైన వ్యక్తితో సంబంధం… సంచలన విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్