telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న అక్కినేని కోడలు

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. అయితే.. తాజాగా సమంతా సౌత్‌ స్టార్లలో సరికొత్త రికార్డు సాధించింది. తన ఫోటోతో ట్విట్టర్‌ ఎమోజీ పొందింది సామ్‌. ఈ ఘనత సాధించిన దక్షిణాది తొలి నటిగా సమంత నిలిచింది. “ద ఫ్యామిలీ మ్యాన్‌ 2” వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సమంత… మనోజ్‌ బాజ్‌పేయితో కలిసి సంయుక్త ట్విట్టర్‌ ఎమోజీ దక్కించుకుంది. దీంతో ఇక నుంచి #TheFamilyMan2 అని ట్విట్టర్‌లో టైప్‌ చేస్తే… సమంత ఎమోజీ కనిపించనుంది.

Related posts