telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ లీక్.. ?

ఆర్ఆర్ఆర్… ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ మరికొందరు కొన్ని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను ఉద్దేశించి విడుదల చేసిన రెండు ట్రైలర్లు కూడా భారీగా ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకు మరింత సందడి చేకూర్చేందుకు జక్కన్న మరో కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్నాడని అందులో బాగంగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ మరికొన్ని భాషల్లో రూపొందుతోంది. అయితే… ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ పొరపాటున మూవీ రిలీజ్‌ డేట్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందట. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా 2021, అక్టోబర్‌ 8న రిలీజ్‌ కాబోతున్నట్లు ఆమె ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టిందట. ఇది కాస్త వైరల్‌ కావడంతో కొద్ది సేపటికే ఆమె తన పోస్టును డిలీట్‌ చేసింది. ఆ లోపే ఆమె పోస్టు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది.

Related posts