భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఉప్పెనా. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ల తొలి పరిచయం అయినప్పటికీ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచానాలు నెలకొన్నాయి. ఈ సినిమా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేసాడు. హీరోయిన్ కృతికి కూడా ఇదే తొలి సినిమా. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. అయితే.. ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుకు మైత్రీమూవీ మేకర్స్ మంచి గిఫ్ట్ ఇచ్చింది. మొదటగా డైరెక్టర్ బుచ్చిబాబుకు కారు లేదా ఇల్లును ఆఫర్ చేసింది నిర్మాణ సంస్థ. అయితే.. బుచ్చిబాబు మాత్రం కారు తీసుకునేందుకే ఆసక్తి చూపించారంట. దీంతో బుచ్చిబాబుకు బెంజ్ జీఎల్‌సీ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేసింది నిర్మాణ సంస్థ. ఈ కారు విలువు అక్షరాల రూ. 75 లక్షలంట. అయితే.. ఈ కారు తీసుకున్న వెంటనే గురువు సుకుమార్‌ను ఎక్కించుకుని హైదరాబాద్ రోడ్లమీద చక్కర్లు కొట్టాడు బుచ్చిబాఉ. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
previous post
next post
వర్మ “పవర్ స్టార్” తీస్తే తప్పేంటి ?… ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్