ప్రారంభం నుండి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించిన కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద, కంచె, అంతరిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడీ యువ కథానాయకుడు. అలాగే హీరోలను డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమాను కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో దిట్ట డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ మిర్చి, ఇండస్ట్రీ హిట్ గబ్బర్ సింగ్, సెన్సేషనల్ హిట్ వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్సే హరీష్ మేకింగ్‌కు ఉదాహరణ.
ఈ ఇద్దరు హీరో వరుణ్ తేజ్, ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`. తమిళ చిత్రం `జిగర్ తండా`కు తెలుగు రీమేక్ ఇది. తమిళంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తుండగా తమిళంలో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రను పోషించిన సిద్ధార్థ్ స్థానంలో తమిళ నటుడు అధర్వ మురళి నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సన్నాహాలు చేస్తుంది.
పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరం కావడం ఇష్టం లేదు : సాయి పల్లవి