telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ మహిళా భారత్ లో ఓ గ్రామానికి సర్పంచ్…

india pakistan

మన భారత్ లో ఓ గ్రామానికి పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మహిళా ఏకంగా సర్పంచ్‌ అయిపోయింది.. అది కూడా మన యోగీ ఆదిత్యానాథ్ ప్రతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో కావడం తీవ్ర కలకలమే రేపుతోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన బానో బేగం (65) అనే మహిళ దాదాపు 40 ఏళ్ల క్రితం యూపీకి వచ్చారు.. అక్కడి ఎటా గ్రామంలోని తన బంధువుల దగ్గరకు వచ్చిన ఆమె.. అక్కడే అక్తర్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.. పాక్‌ పౌరసత్వం, సుదీర్ఘ కాలం పాసుపోర్టు ఉన్నా.. ఆమె అక్కడేఉండిపోయారు.. కలిగిన బానో బేగం నాటి నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. అయితే, భారత పౌరసత్వం కోసం పలుమార్లు ప్రయత్నం చేశారు.. చివరకు ఆధార్‌ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలను కూడా పొందరు. కాగా, 2015లో ఆమె తొలిసారి గ్వాడౌ గ్రామ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే, 2020 జనవరి 9న గ్రామ సర్పంచ్‌ షెహ్నాజ్ బేగం మృతిచెందడంతో.. బానో బేగంను తాత్కాలిక సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.. కానీ, ఈ విషయంపై కొందరు స్థానికులు బానో బేగంపై ఫిర్యాదు చేశారు.. అధికారులు విచారణ జరుపగా ఆమె పాకిస్థాన్‌ జాతీయురాలిగా తేలిపోయింది.. దీంతో.. కంగుతిన్న అధికారులు.. బానో బేగం సర్పంచ్‌ అయ్యేందుకు సహకరించిన వారితోపాటు, ఆమెకు ధ్రువీకరణ పత్రాలను ఎలా వచ్చాయి.. ఎవరు సహకరించారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Related posts