telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొత్త వ్యవసాయ చట్టాల పై హర్యానా సీఎం కీలక వ్యాఖ్యలు…

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. బుధవారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చల్లో కొంత ముందడుగు పడినా.. పూర్తిస్థాయిలో చర్చలు సఫలం కాలేదు.. అయితే, మరోసారి భేటీ కావాలని నిర్ణయానికి వచ్చారు. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీ పాలితరాష్ట్రానికి చెందిన సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారియి.. హర్యానా రైతులకు మద్దతు ధర కల్పించని పక్షంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. బీజేపీయేతర రాష్ట్రాలు కొన్ని వ్యతిరేకిస్తున్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాలు సమర్థిస్తున్నాయి.. హర్యానాలో పరిస్థితి వేరుగా ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడంతో అటు రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వలేక, ఇటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేక అయోమయ పరిస్థితిలో ఉంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఇక, తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికలపై వ్యవసాయ చట్టాల ప్రభావం బాగానే పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో మనోహార్ లాల్.. కనీస మద్దతు ధరపై రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కనీస మద్దతు ధరను మేం కొనసాగిస్తాం. కనీస మద్దతు ధర అందించని పక్షంలో మనోహర్ లాల్ రాజకీయాల నుంచి తప్పుకుంటారు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

Related posts