telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్ పై హత్యాయత్నం కేసు.. పరారైన రెస్టారెంట్ యజమాని

YS Jagan Case transfer to NIA
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.  శ్రీనివాసరావుకు ఉద్యోగం ఇచ్చిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి అధికారులు సమన్లు జారీ చేశారు. తాను త్వరలోనే విచారణకు హాజరు అవుతానని హర్షవర్ధన్ అధికారులకు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నేను కదలలేని స్థితిలో ఉన్నాననీ, కోలుకున్నాక వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని చెప్పారు.
అయితే ఎన్ఐఏ అధికారులు విచారణ జరిపేందుకు ఈరోజు అకస్మాత్తుగా రెండు కార్లలో హర్షవర్ధన్ ఇంటికి చేరుకొన్నారు. ఇంటికి తాళం వేసి ఉండదండతో అతని ఆఫిస్ వద్దకు వెళ్లారు. ఇంటికి, ఆఫీసులకు తాళాలు వేసి ఉండటంతో అక్కడే ఆగిపోయారు. హర్షవర్ధన్ ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. దీంతో అధికారులు చేసేదేమి లేక అక్కడి నుండి వెళ్లిపోయారు.

Related posts