telugu navyamedia
సినిమా వార్తలు

పోలీసులకు భారం… ట్విట్టర్ ఏం చేయగలదు : చిన్మయి

Chinmai
గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని గాయని చిన్మయి శ్రీపాద వరుస ట్వీట్లతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ సాహిత్య రచయిత వైరాముత్తుపై ఆమె చేసిన ఆరోపణలకు చాలామంది నుంచి చిన్మయికి బాగానే సపోర్ట్ లభించింది. కానీ మరోవర్గం నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి.
తాజాగా చిన్మయిని అసభ్యకరంగా విమర్శిస్తూ వచ్చిన ట్వీట్ పై చిన్మయి స్పందించింది. “‘సోషల్‌మీడియాలో మనల్ని విమర్శించడానికి ఇలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్లు అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పటికీ… మనం సౌమ్యంగా ఉండాలి. ఇలాంటి మూర్ఖుల్నే మనం “అన్నా”, “సర్‌” అని గౌరవంగా పిలవాలి.
ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉంటారనేది నాకు అర్థం కాదు. నేను ఓ గాయనిని అయినప్పటికీ అత్యాచారం చచేస్తామంటూ ఎన్నో ట్వీట్లు, ఈమెయిళ్లు వస్తున్నాయి. మహిళలను తమకు రాసిచ్చేసినట్లు, మహిళలు తమ హక్కు అన్నట్లుగా చాలా మంది పురుషులు భావిస్తున్నారు. ఈ విషయంలో ట్విట్టర్‌ ఏమీ చేయదు. పోలీసులకు కూడా భారం ఎక్కువైపోతోంది.
నాకు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు మిగిలిన నటీమణులకు రోజూ వచ్చే ఇలాంటి చెత్త సందేశాలను షేర్‌ చేస్తే మీరే అందులో కొట్టుకుపోతారు. సమాజం మారింది… కానీ ఇంకా చాలా మారాల్సి ఉంది.” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు చిన్మయి. 

Related posts