అందంతో పాటు, అభినందించదగిన అభినయం కూడా ప్రదర్శించగల హీరోయిన్ పూజ హెగ్డే. ఒక లైలా కోసం సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఆ తరవాత ముకుందా సినిమాలో మెరిసింది ఈ చిన్నది. ఆతర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన ‘మెహంజదారో’ సినిమాలో అవకాశం దక్కించుకుంది.2017లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంతో తనలోని గ్లామర్ కోణాన్ని బయటపెట్టి తొలి సూపర్ హిట్ అందుకుంది పూజా హెగ్డే. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోలసరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఈ భామ పుట్టిన తోజు సందర్బంగా చాలా మంది సినీ ప్రముఖులు తనను విష్ చేసారు. అయితే అందులో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు. ఇక ఈ భామ తనకు రిప్లై ఇస్తూ… దేవిశ్రీ సంగీతం అందించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ “అత్తారింటికి దారేది”లోని దేవ దేవం పాటను రిపీటెడ్ గా వింటున్నానని తెలిపింది. అయితే పూజా పవన్ తో ఒక సినిమాలో కూడా నటించనుంది అని టాక్ కూడా ఈ మధ్యనే ఊపందుకుంది. ఇదంతా ఆ ఎఫెక్టే అని కొందరు లేదు తనకు ఆ పాట నచ్చి అంతలా వింటుందని మరొకొందరు అనుకుంటున్నారు.
ఎంపీటీసీ గెలవని పంచాయతీలకు నిధులు రావు : వైసీపీ ఎమ్మెల్యే