తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి నోవాటెల్‌లో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ప్రారంభమైంది. ప్రారంభ సమావేశానికి అన్నా హజారే, సార్క్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్ బహదూర్ థాపా ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు. మూడు రోజుల అంతర్జాతీయ యువజన సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత తెలిపారు.
సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే దిశగా ఈ సదస్సు నేడు, రేపు కొనసాగనుంది. 135 దేశాలకు చెందిన 550 మంది ప్రతి నిధులతోపాటు 16 దేశాల నుండి డెబ్బై మందికిపైగా నిపుణులు హాజరయ్యారు. ప్యానలిస్టులుగా అసోం ఎంపీ గౌరవ్ గగోయ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, నిజామాబాద్ ఎంపీ కవిత వ్యవహరిస్తున్నారు.