టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం బుధవారం వైఎస్ జగన్‌తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు మోహరించారు. జగన్ ఇంటికి వచ్చి వెళుతున్న వారి వివరాలను ఈ బృందం సేకరిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి వివరాలను వారు విజయవాడకు చేరవేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆరోపించాయి.
కొందరు కార్యకర్తలు ఇంటెలిజెన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారు తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు పలు చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు కనిపించడం కలకలం రేపింది.
ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే: యనమల