telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించిన మాజీ ఎంపీ ఉండవల్లి…

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… ఈనెల 26వ తేదీన వామపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాల తలపెట్టిన భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈనెల 26న భారత్  బంద్ కు నా మద్దతు ఉంటుందని తెలిపారు.. భారత్ బంద్ విజయవంతం అయితే ప్రధాని నరేంద్ర మోడీ.. తన విధానాలపై  వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..  ప్రధాని మోడీ అనుసరిస్తున్న క్యాపిటలిస్ట్  విధానాలపై భారతీయ జనతా పార్టీలోనే మద్దతు లేదన్న ఆయన.. పార్లమెంటులో పారిశ్రామికవేత్తలు ఎక్కువ మంది ఎంపీలుగా ఉండటం వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే నాటికి రూ.46 లక్షల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు అది రూ. కోటి 7 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు.. మరోవైపు.. విశాఖలో జరిగిన సభతో స్టీల్ ప్లాంట్‌ ఉద్యమం ఇంకా ఉధృతంగా ఉందనిరుజువైందన్న ఉండవల్ల అరుణ్ కుమార్… ఒక్క స్టీల్ ప్లాంట్ అంశాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. అయితే చూడాలి మరి ఈ భారత్ బంద్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.

Related posts