telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పీఎఫ్ డిపాజిట్లపై .. వడ్డీరేటు పెంపు.. : కేంద్రం

interest rate increased on PF accounts

కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతానికి పెంచనున్నట్టు ఆ శాఖా మంత్రి సంతోశ్ అగర్వాల్ పేర్కొన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

2018-19కి గాను పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సుముఖత వ్యక్తం చేసింది. ఆదాయ పన్ను విభాగం, కార్మిక శాఖ సంయుక్తంగా నోటిఫై చేస్తే ఇది అమల్లోకి వస్తుంది. ప్రకటన విడుదలైన వెంటనే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుంది. ప్రస్తుతం పీఎఫ్‌పై 8.55 శాతం వడ్డీ లభిస్తుండగా, ఇకపై 8.65 శాతం లభించనుంది.

Related posts