telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

నటిపై .. దాడి.. పోలీసుల దర్యాప్తు..

tv actress attacked by roommates

‘నామ్‌కరణ్’ షోతో పాప్యులర్ అయిన బుల్లితెర నటి నళిని నేగిపై రూమ్మేట్ దాడి చేసి గాయపరిచింది. రూమ్మేట్ ప్రీతి రాణా, తల్లి స్నేహలత రాణాతో కలిసి తనపై దాడిచేసిందంటూ పోలీసులకు నళిని ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడితో మారిపోయిన నళిని ముఖానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓషివారా పోలీసుల కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా నళిని, ప్రీతి కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత నళిని మరో ఫ్లాట్‌కు మారింది. ఇటీవల నళినిని కలిసిన ప్రీతి.. తనకు ఫ్లాట్ దొరకడం లేదని, దొరికేంత వరకు ఉంటానని అభ్యర్థించింది. దీనికి నళిని అంగీకరించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రీతి తల్లి స్నేహలత కూడా వచ్చింది.

దీంతో రూము ఖాళీ చేయడంలో ప్రీతికి సహాయం కోసమే ఆమె వచ్చిందని నళిని భావించింది. గతవారం నళినితో స్నేహలత అకారణంగా వాదనకు దిగింది. అక్కడితో ఆగక కుమార్తె ప్రీతితో నళినిపై లేనిపోనివి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి నళినిని అసభ్యంగా తిడుతూ దాడి చేశారు. స్నేహలత గ్లాసుతో నళిని ముఖంపై దాడిచేసింది. ఇద్దరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నళిని పేర్కొంది. తాను నటిని కావడంతో తన ముఖాన్ని ఛిద్రం చేయాలని భావించారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts