telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం…

Delhi

మన దేశంలో ఈ మధ్య రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అయితే మన దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈరోజు నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధిస్తు నిర్ణయం తీసుకుంది.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.  ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  ఈరోజు బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 96వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఇక మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  నైట్ కర్ఫ్యూతో పాటుగా ఉదయం 144 సెక్షన్ సీఆర్పీసి, వీకెండ్స్ లో లాక్ డౌన్ కూడా మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ రకమైన లాక్ డౌన్ లు ఇంకా ఎన్ని రాష్ట్రలో వస్తాయి అనేది.

Related posts