telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి

Nithin Gadkari

ఢిల్లీలో రైతుల ఆందోళనలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయి.  రైతులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  అయితే, రైతు చట్టాల వలన రైతులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెప్తున్నది.  రైతులు చట్టాలను అర్ధం చేసుకోవాలని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. రైతులు ఇచ్చే విలువైన సూచనలను స్వీకరిస్తామని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగదని అన్నారు  కొన్ని శక్తులు ఆందోళనలను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు.  రైతులకు వ్యతిరేకంగా తాము ఏమి చేయడం లేదని, రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్, ట్రేడర్ సహా ఎక్కుడైన అమ్ముకునే స్వేచ్ఛ రైతుకు ఉందని అన్నారు.  ఏ సమస్యకైనా చర్చలతో పరిష్కారం జరుగుతుందని, రైతులు ఆందోళనలు విరమించి చర్చలకు రావాలని అన్నారు.  భారతదేశం ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల విలువైన క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోందని, ఇందులో కనీసం రూ.2 లక్షల కోట్ల విలువైన ఇథనాల్ ను వినియోగించాలని చూస్తోందని అన్నారు.  దేశంలో రూ.2 లక్షల కోట్ల ఇథనాల్ ఎకానమీ సాధిస్తే, రైతుల జేబుల్లోకి రూ.లక్ష కోట్లు వెళ్తాయని అన్నారు.

Related posts