telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉషోదయ సుందరీమణీ!

ushodaya sundarimani poetry corner

ఉషోదయ సుందరీమణీ!
మహిలో వలపు సుగంధ జవ్వనీ!
నీ ప్రేమైక దృక్కుల్లో అనంతకోటి మధుర భావాలు
నాకై పూజాఫలమై జన్మించిన
విరి సుగంధ లాలనలు
సర్వత్రా నా నీవే
నా సమస్త ప్రగతి సుధ నీవే
జగతి జీవులకు ఆధారం
గుండె గూటిలో వ్యవహారం
మహోన్నత మధుర స్వర సాగరతీరం
యుగయుగాల వసుధైక ఊహల విహారం
నీలో పొంగిన తరుణం
నీ ప్రణయం నాకు శరణం
నీవే నా శీత భానుకిరణం
ఉషోదయ సుందరీమణీ!
నా ప్రేమ ఉషస్సు నీవు
నా ప్రేమ తపస్సు నీవు
నీవే నా సర్వస్వ సహగామిని!
నీవే నా ప్రేమ శిరోమణి!

 

-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి

Related posts