సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంజీర రచయితల సంఘం సోలిపేట రామలింగారెడ్డిపై స్వప్న సాధకుడు అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాని సిద్ధిపేటలో రెడ్డి సంక్షేమ భవన్ లో తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఒకే జీవితంలో మూడు అవతారాలు విజయవంతంగా చూశారని తెలిపారు. వామపక్ష భావజాల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, ప్రజాప్రతినిధిగా ఆయన సాఫల్యం పొందారని వివరించారు. ఆయన స్టేజీ వివాహం చేసుకోవడమే కాకుండా, తన పిల్లలకు సైతం స్టేజీ వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
మాయమాటలతో కేసీఆర్ ఐదేళ్లు పాలన: ఎంపీ కోమటిరెడ్డి