telugu navyamedia
క్రీడలు వార్తలు

వేరే జట్టు ఆటగాడి భార్యతో రషీద్ ఖాన్ వాగ్వాదం…

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ చాలా కీలకం. 66 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన అతను 75 వికెట్లను పడగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించే సత్తా రషీద్ ఖాన్ సొంతం. డెత్ ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేయగలడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్ తో ఆడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు రషీద్ ఖాన్, ఎరిన్ హాలెండ్ మధ్య వాడివేడిగా వాగ్వివాదం నడిచింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వారిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచింది. అయితే ఎరిన్ హాలెండ్ మరెవరో కాదు. కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ భార్య. రషీద్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ దీనికి కారణమైంది. ఐపీఎల్ 14వ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌ను ఆడటానికి తాను సంసిద్ధంగా ఉన్నానంటూ రషీద్ ఖాన్ తన అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అది ఎరిన్ హాలెండ్ కంట్లో పడింది. వెంటనే ఆమె దానికి రిప్లయ్ పెట్టారు. తాను కోల్‌కత నైట్ రైడర్స్‌ను సపోర్ట్ చేస్తున్నానంటూ కామెంట్ చేశారు. దీనికి రషీద్ ఖాన్.. నో అంటూ రిప్లయ్ ఇచ్చాడు. అయితే ఆస్ట్రేలియకు చెందిన బెన్ కటింగ్.. ఇంతకముందు హైదరాబాద్ జట్టుకు ఆడిన ఈ సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ ఫ్రాంఛైకి ఎంపికయ్యాడు.

Related posts