telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వరుణ్ తేజ్ పెళ్లి పై స్పందించిన నాగబాబు…

Nagababu

ఈ మధ్యే నిహారిక పెళ్ళి ఇలా జరిగిందో లేదో అందరి చూపులు వరుణ్ పైనే. అప్పుడే వరుణ్ పెళ్ళికి సంబంధించిన పలు రూమర్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వరుణ్ పెళ్లిపై ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా మరోమారు స్పందించారు. ఇటీవల నాగబాబు ఇన్‌స్ట్రాగ్రామ్‌ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. అదే సమయంలో ఓ నెటిజన్  ‘వరుణ్ అన్నా సాయి పల్లవి జోడి బాగుంటుంది… వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తా సార్..’ అని కామెంట్ చేశాడు. దానికి స్పందించిన నాగబాబు ఆ నెటిజన్ కు సమాధానంగా జాతిరత్నాలు సినిమాలోని  క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జడ్జ్ గా ఉన్న బ్రహ్మానందం “తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే” అనే డైలాగ్ చెబుతాడు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.  కాగా నాగబాబు ఇక్కడికే వరుణ్ తేజ్ పెళ్లిపై పలుమార్లు స్పందించారు. అంతేకాదు వరుణ్ కు మంచి అమ్మాయిని చూడమంటూ మెగా అభిమానులకు సలహా కూడా ఇచ్చాడు. అయితే వరుణ్ తేజ్ ఇప్పుడే పెళ్లి వద్దని అంటున్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగబాబు. అప్పటి నుంచి వరుణ్ ఓ హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడనే రూమర్లు స్టార్ట్ అయ్యాయి.

Related posts