telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” షాకింగ్ నిర్ణయం ?

Sye-Raa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. “సైరా”కు బాలీవుడ్ స్టార్ హీరో హ‌ృతిక్ రోషన్ నుంచి భారీ పోటీ ఎదురవుతోంది. అక్టోబర్ రెండో తేదీనే హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన “వార్” సినిమా హిందీతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదలవుతోంది. దీంతో రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గితే మంచిదని “సైరా” టీమ్ భావిస్తోందట. “సైరా” విడుదలను ఒక వారం వాయిదా వేసుకోమని “వార్” బృందం నుంచి కూడా రిక్వెస్టులు వచ్చాయట. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 8వ తేదీన విడుదల గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మెగాస్టార్ అభిమానులకు షాక్ తప్పదు.

Related posts