telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వారి త్యాగాల ఫలితమే బీజేపీ : బండి

నేడు తెలంగాణలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జండా ఆవిష్కరించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..  అనేక మంది కార్యకర్తల త్యాగాల ఫలితమే బీజేపీ ఈ రోజు ఈ స్థాయికి చేరిందని… 2 స్థానాల నుండి 303 స్థానాల వరకు బీజేపీ ఎదిగిందని పేర్కొన్నారు.  అధికారం కోసం బీజేపీ ఎప్పుడు పని చేయలేదని… పేద ప్రజల కోసం,  దేశం కోసం బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుందన్నారు.  అటల్ బిహారి వాజ్ పేయ్ ఒక్క ఓటుతో అధికారాన్ని వదులుకున్నారని… అనేక సంక్షేమ పథకాలను.. కేంద్రం ప్రవేశ పెడుతుందని పేర్కొన్నారు.  బీజేపీ లేని పార్టీని దేశ ప్రజలు ఉహించుకోవడం కష్టమని.. తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.  గడిలా పాలనను అంతం చేసే పార్టీ బీజేపీ అని.. 2023 లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపుచ్చారు బండి సంజయ్‌.  ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం, తీవ్ర వాదాన్ని అణిచివేస్తుందని.. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏం జరిగిందో చూసామన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు నాగార్జున సాగర్ ఎన్నికల పైన దృష్టి పెట్టాయి.

Related posts