telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫోన్ లో సీఐతో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం!

MLA Vundavalli Sridevi ycp

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ సీఐపై ఫోన్ లో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నీకేమైనా మెంటలా ” అంటూ సంబోధిస్తూ.. పోలీసు ఆఫీసర్ ను కూడా చూడకుండా మాట్లాడారు.

ఎప్పటి నుంచి చెబుతున్నాను? వాళ్లను పంపేయొచ్చుగా? వాళ్లను పట్టుకున్న రోజునే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్? నేనంటే గౌరవం లేదా?’ అంటూ రెచ్చిపోయారు. అందరినీ వదులుతున్నావు, నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావు, రెండు నిమిషాల్లో వెళ్లిపోతావు. ఎస్పీకి, డీజీపీకి చెబుతా’ అంటూ హెచ్చరించారు.

Related posts