telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతిలో .. స్థానిక ఎన్నికల వ్యూహాలు..

amaravathi ap

రాజధాని తరలింపు కు వ్యతిరేకంగా అమరావతి పరిధిలో గ్రామాల ప్రజలు ఆందోళనల్లో ఉండగా..అక్కడ ఎన్నికల పంచాయితీకి ప్రభుత్వం సిద్దం అవుతోంది. అమరావతి రాజధానిగా ప్రకటించిన తరువాత ఆ ప్రాంతాన్ని మున్సిపాల్టీ..కార్పోరేషన్ గా నాటి..నేటి ప్రభుత్వాలు గుర్తించలేదు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారులో భాగంగా..ఈ రోజు అమరావతి పరిధిలోని 29 గ్రామాల రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. దీని ద్వారా అక్కడ ప్రస్తుత పరిస్థితిని..డైవర్ట్ చేసేందుకు సైతం ఈ నిర్ణయం అధికార పార్టీకి మేలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీని ద్వారా ఆ ప్రాంతంలో కొత్త రాజకీయ సందడి మొదలై..ఆందోళనల తీవ్రత తగ్గుతుందనేది మరో ఆలోచన.

పంచాయితీ ఎన్నికల ద్వారా రాజధాని ప్రాంతంలో వ్యతిరేకత కొంత వరకు పక్కదోవ పడుతాయని అంచనా వేస్తోంది. గ్రామాల్లో సాధారణం గా ఉండే రాజకీయాలు..వర్గాలకు పంచాయితీ ఎన్నికలే కీలకం. అయితే, అమరావతి ప్రాంతంలో మాత్రం ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరూ రాజధాని తరలింపుకు వ్యతిరేకం గా పోరాటం చేస్తున్నారు. అన్ని పార్టీల వారు ఇందులో బాగస్వాములయ్యారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి..అక్కడ ఎన్నికల వాతావరణం తీసుకొచ్చినా..స్థానికులు అందులకు సిద్దం అవుతా రా లేక దీని పైన కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న ఈ గ్రామాల ప్రజలు మరి..తమ గ్రామాల పరిధిలో ఎన్నికలకు సహకరిస్తారి..లేక నిరసనలో భాగంగా పంచాయితీ ఎన్నికలను బహిష్కరిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related posts