పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తుడటంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్. ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టే ఉదయం 9.9 గంటలకు వకీల్ సాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. గాంధీ, అంబేద్కర్ వంటి మహానుభావుల్ని ఈ మోషన్ పోస్టర్‌లో చూపిస్తూ.. లాయర్ గెటప్‌లో సీరియస్ లుక్‌లో దర్శనం ఇచ్చారు పవన్ కళ్యాణ్. చేతిలో క్రిమినల్ లా బుక్ పట్టుకుని చేతితో కర్ర పట్టుకుని వకీల్ సాబ్.. నేరస్థుల కీళ్లు విరిచేందుకు రెడీ అని చెప్పకనే చెప్తున్నాడు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో ‘సత్యమేవ జయతే’ అంటూ వచ్చే ఆర్ఆర్ మోషన్ పోస్టర్‌కి మరింత హైప్ ఇచ్చింది.
previous post
ముందే చెప్పా.. “సైరా” ఎవరు చూస్తారు అని… గిరిబాబు కామెంట్స్