నేడు శ్రీలంకతో మూడు టీ20 లలో భాగంగా మొదటి మ్యాచ్ ఆడనుండగా టీమిండియాకు గాయాల బెడద వెంటాడుతుంది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వేలుకు గాయం అయింది. ఫిజియో పర్యవేక్షించినా.. ఆ తర్వాత ప్రాక్టీస్‌కు మాత్రం కోహ్లీ అందుబాటులో లేదు. దీంతో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్దత ఏర్పడింది.
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుతో లేదు కాబట్టి ఒకవేళ కోహ్లీ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే.. ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2018 నిదహాస్ ట్రోఫీకి మొదటిసారిగా ధావన్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత ఆసియా కప్ 2018కి కూడా రోహిత్ డిప్యూటీగా బాధ్యతలు చేపట్టాడు. అటు కోహ్లీ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చాలా రోజుల వ్యవధి తర్వాత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌తో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు.
రాజకీయాలంటే అసహ్యం… సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ నట దిగ్గజం వ్యాఖ్యలు