telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈ గణతంత్ర దినోత్సవ వేడుకులకు అతిథులు లేరు : కేంద్రం

ఈ ఏడాది జనవరీ26న ఘనంగా జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విదేశీ ప్రతినిధులు ఎవ్వరూ కూడా హాజరు కావడంలేదని, దేశంలో విస్తరిస్తున్న కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్పింది. ‘ప్రపంచంలో కరోనా విజృంభింస్తోంది. దీనిని నిలువరించడం చాలా కష్టతరంగా ఉంది. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం.. దేశంలో జనవరీ 26న జరగనున్న సభలకు, వేడుకలకు ఏ దేశ ప్రతినిధి కూడా అతిథిగా రావడం లేద’ని దేశ అంతర్జాతీయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ్ వర్చువల్ ప్రెస్ మీట్‌లో తెలిపారు. అయితే ఈ నెలలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు గతేడాది యూకే మినిస్టర్ బోరిస్ జాన్సన్‌ ముఖ్య అతిథిగా పిలిచాం.. దానికి బోరిస్ భారత్ ఇన్విటేషన్‌ను ఆమోదించారని డిసెంబరులో భారత్‌ను వీక్షించిన యూకె విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ తెలిపారు. అయితే ఈ నెల 5వ తారీకున బోరిస్ తన భారత వేడుకకు రాలేనని, తాను దేశంలో ఉండటం చాలా ముఖ్యమని చెప్పి తన ప్రయాణాన్ని నిలిపివేశారు. తన దేశంలో పెరిగిపోతున్న మహమ్మారిని నియంత్రించేందుకు కావలసిన చర్చలు చేపట్టడానికి తాను అక్కడ ఉండాలని తెలిపారు. తాను భారత్‌కు రాలేకపోతున్నందుకు చాలా చింతిస్తున్నానని మోదీకి తెలపమని చెప్పారని ప్రతినిధి చెప్పారు.

Related posts