telugu navyamedia
రాజకీయ

సుప్రీం కోర్టు నుంచి తొలిసారి ప్రత్యక్ష ప్రసారం..

*చ‌రిత్ర‌లో తొలిసారి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న సుప్రీంకోర్టు..
*ఇవాళ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
*అఖిల‌ప‌క్షం స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని ఆదేశం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. పలు కీలక కేసులను జస్టిస్ ఎన్వీ రమణ విచారించారు.

కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పని చేశానని జస్టీస్ ఎన్వీరమణ చెప్పారు. సుప్రీంకోర్టు, కొలీజియంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

న్యాయ వ్యవస్థ అవసరాలను తీర్చిదిద్దేందుకు ఎన్వీరమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తుల్లో ఎన్వీరమణ అత్యుత్తమమమైనవారని కొనియాడారు. అధ్భుతమైన ప్రగతిశీల దృక్పధం ఉన్న ఆయన న్యాయవ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసించారు.

కాగా చ‌రిత్ర‌లో తొలిసారి సుప్రీం కోర్టు నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. ఇవాళ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప‌ద‌వీ విర‌మ‌ణ‌ సందర్భంగా…ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్వీ రమణ రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ ప్రారంభించారు. పదవీ విరమణ చివరి రోజు కీలక తీర్పును మ‌రికాసేట్లో ఇవ్వబోతున్నారు.

 

Related posts