అమెరికాకు, ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని భారత్ మరోసారి స్పష్టం చేసింది.జమ్మూ కా శ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు మినహా మిగతా అంశాలన్నీ భారత్, పాక్ ద్వైపాక్షిక వ్యవహారాలని రాజ్‌నాథ్ వివరించారు. కా శ్మీర్ ప్రజల శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు రాజ్‌నాథ్ చెప్పారు.
రాజ్ నాథ్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భారత్‌కు మద్దతుగా నిలిచినందుకు అమెరికాకు ధన్యవాదాలు చెప్పారు. భారత్‌లో తయారీలో భాగస్వాములు కావాలని.. అమెరికా రక్షణ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని రాజనాథ్ సింగ్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ని కోరారు. ఇటీవల కా శ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల మార్క్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాలు రక్షణ సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు రక్షణ శాఖ వర్గాల సమాచారం.