telugu navyamedia
తెలంగాణ వార్తలు

పాత బస్తీలో హై అలర్ట్, 4వేల మంది పోలీసుల‌తో భారీ భ్ర‌ద‌త‌

*పాత బస్తీలో హై అలర్ట్
*రాజాసింగ్ అరెస్ట్ నేప‌థ్యంలో భారీ బందోబ‌స్తు
*పాత‌బ‌స్తీలో విద్యాసంస్థ‌లు, షాప్‌లు బంద్‌
* 14 స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు గుర్తింపు
*4వేల మంది పోలీసుల‌తో భారీ భ్ర‌ద‌త‌

హైదరాబాద్ పాతబస్తీ‌లో హైఅలర్ట్ నడుస్తోంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్ధతుగా బేగంబజార్‌ను బంద్ చేశారు. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు .

రాజాసింగ్ వాఖ్యలకు నిరసనగా నేడు చార్మినార్‌ దగ్గర నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మక్కామసీదు పరిసరాల్లో అణువణువు నిఘా పెట్టారు. ఉద్రిక్తతలు, ఘర్షణలు జరగకుండా దాదాపు 4 వేల మంది భద్రతా బలగాలను మోహరించారు.

నేడు శుక్రవారం కావడంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా నిఘా కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ ఫోర్స్‌ను ఉంచారు.

ఫలక్‌నుమా, చంద్రాయన్ గుట్ట అలియాబాద్, శాలిబండ, మొగల్‌పురా, హుస్సేనీ అలం, పట్టార్ గడ్డి, మదీనా దారుషిఫా, డబ్బీర్ పుర, మురిగి, చౌక్ మిరాల మండి తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts