telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అమెరికా పోలీసుల చేతిలో మరో నల్ల జాతీయుడు హతం

gun fire

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. అక్కడ నిరసనలు చల్లారకముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అట్లాంటాలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో అట్లాంటాలో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ నగర పోలీసు చీఫ్‌ రాజీనామా చేశారు.

రెషార్డ్‌ బ్రూక్ ‌ అట్లాంటాలోని ఓ రెస్టారెంటు ముందు రాత్రి సమయంలో కారును నిలిపి అందులోనే నిద్రపోయాడు.ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్‌ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు తిరగబడ్డాడు. అంతేగాక, ఓ పోలీసు తుపాకీని లాక్కొని పరుగులు తీశాడు. ఈ సమయంలో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వెల్లడించారు.

Related posts