telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

registration office

తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పని ఒత్తిడి పెరిగింది. కొందరు సబ్‌రిజిస్ట్రార్లు ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ డాటా ఆపరేటర్లను నియమించుకోవడం వివాదానికి దారితీసింది. ఈ పద్ధతిని ఏసీబీ అధికారులు తప్పుబట్టారు. ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్ చిరంజీవులు ఆదేశాలు జారీచేశారు.

దీంతో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విధుల నిర్వహణకు 150 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో కార్యాలయాల్లో అప్పటినుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందగించింది. తమకు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని కమిషనర్ ప్రభుత్వానికి విన్నవించారు. స్పందించిన ప్రభుత్వం 150 మందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Related posts