telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం

Ycp Kannababu

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఇంటెలిజెన్స్ శాఖ నివేదికతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు వారం కిందట స్పష్టం చేశాయి.

కన్నబాబు ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని నిఘా వర్గాల నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కన్నబాబుకు సూచనలు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలను పాటించాలని కన్నబాబు నిర్ణయించుకున్నారు. తన తాజా పర్యటనలకు కొత్తగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు.

Related posts