telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరింత సురక్షితంగా .. గూగుల్ పే .. కొత్తగా బయోమెట్రిక్ ..

Google Pay App Authorisation Asks RBI

గూగుల్ పై ఇప్పుడు మరింత సెక్యూరిటీని పెంచింది. ఇప్పటివరకు లావాదేవీలకు పిన్ ఎంటర్‌ చేయాల్సి ఉండేది. తాజాగా దాని స్థానంలో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చింది. ఆండ్రాయిడ్ 10తో ఈ ఫీచర్‌ను గూగుల్ ప్రకటించింది, త్వరలో ఆండ్రాయిడ్ 9 ఫోన్లలో కూడా రానుంది. ఈ ఫీచర్ డిజిటల్ వ్యాలెట్ ప్లాట్ ఫాం, ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పే లేటెస్ట్ వెర్షన్ 2.100 యాప్ లో ఈ కొత్త ఫీచర్ చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ అప్ డేట్ తో గూగుల్ పే యూజర్లు తమ డివైజ్ లోని ఫింగర్ ఫ్రింట్, ఫేషియల్ రికగ్నైనేషన్ ఫీచర్ ద్వారా ఈజీగా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. గూగుల్ పే యాప్‌లో సెండింగ్ మనీ(Sending money) సెక్షన్ కింద ఈ కొత్త ఫీచర్ ఆప్షన్ కనిపిస్తుంది.

వినియోగదారులు ఈ రెండు ఫీచర్లను వినియోగించుకునే సదుపాయాన్ని కూడా గూగుల్ పై అందుబాటులో ఉంచింది. కనుక యూజర్లు పిన్ సెక్యూరిటీ నుంచి బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కు మార్చుకోవచ్చు. లేదంటే రెండు ఆప్షన్లను అలాగే ఉంచుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కేవలం నగదు లావాదేవీలకు మాత్రమే పనిచేస్తుంది. స్టోర్లలో పేమెంట్స్ జరిపే సమయంలో పనిచేయదు. అందుకోసం మీ ఫోన్ అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే పిన్ సెక్యూరిటీ ఫీచర్ కంటే బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌తో పలు ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నిసార్లు పిన్ నెంబర్ మర్చిపోతే గూగుల్ పే పేమెంట్స్ చేసే పరిస్థితి ఉండదు. అదే ఈ కొత్త ఫీచర్ ద్వారా సులభంగా.. వేగవంతంగా లావాదేవీలు చేసుకోవచ్చునని గూగుల్ ప్రొడక్టు మేనేజర్ స్టీవెన్ సోనెఫ్ తెలిపారు. కాగా ప్రస్తుతం గూగుల్‌ పేకు ఇండియాలో 67 మిలియన్ల (6.7 కోట్లు) మంది గూగుల్ పే యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

Related posts