telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ సెన్సార్ పూర్తి…

రాజకీయాల కారణంగా మూడు ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అందులో ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకుంది. సెన్సార్ టాక్ అయితే వకీల్ సాబ్‌కు చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఈ సినిమాను థియేటర్లలో వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం పవన్‌ మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts